Dhanush: జగమే సంగీతమంత్రం

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘జగమేతంతిరం’. ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్‌, కలైయారసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళం, కన్నడ, మలయాళంతోపాటుగా..

Updated : 08 Jun 2021 09:30 IST

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘జగమేతంతిరం’. ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్‌, కలైయారసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళం, కన్నడ, మలయాళంతోపాటుగా... తెలుగులోనూ ‘జగమే తంత్రం’ పేరుతో ఈ నెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందీ చిత్రం. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని పాటల్ని సోనీ మ్యూజిక్‌ సంస్థ విడుదల చేసింది. ‘‘గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్‌ చేసే సందడి అలరిస్తుంది. కార్తీక్‌ సుబ్బరాజు విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు శ్రోతల్ని అలరించాయి. ఇందులో పాటలన్నీ ఎంతో ప్రత్యేకం, వినూత్నం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ధనుష్‌ తెలుగు చిత్రం?
తమిళ కథానాయకులు నేరుగా తెలుగులో సినిమాలు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఇప్పటికే బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న ఆ కథానాయకులు, నేరుగా తెలుగు చిత్రాలు చేయడంతో మరింతగా ప్రేక్షకులకు చేరువ కావొచ్చనేది వ్యూహం. ఇప్పటికే కార్తి తెలుగు చిత్రం చేశాడు. విజయ్‌ త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అదే తరహాలో ధనుష్‌  త్వరలోనే ఓ తెలుగు చిత్రం చేయొచ్చని ప్రచారం సాగుతోంది. ఆ మేరకు అగ్ర దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ధనుష్‌ చిత్రాలు ఇప్పటికే తెలుగులో అనువాదమవుతూ అలరిస్తున్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని