‘సన్‌ ఆఫ్‌ ఇండియా’.. తొలి పాట

మోహన్‌బాబు కథానాయకుడిగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

Published : 14 Jun 2021 01:14 IST

మోహన్‌బాబు కథానాయకుడిగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈనెల 15న ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మోహన్‌బాబు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘‘1995 జూన్‌ 15న నా ‘పెదరాయుడు’ సినిమా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇది విడుదలైన 26ఏళ్ల తర్వాత.. ఇప్పుడదే తేదీన నా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ లిరికల్‌ వీడియో విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నా. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే.. ఇప్పుడీ సినిమాకి నా తనయుడు విష్ణు వర్థన్‌బాబు నిర్మాత కావడం సంతోషదాయకం. ఈ చిత్రంలోని 11వ శతాబ్దపు రఘువీర గద్యంను ఇళయరాజా సంగీత సారథ్యంలో.. రాహుల్‌ నంబియార్‌ స్వరంతో లిరికల్‌ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పాటని శ్రీరామునికి అంకితం ఇస్తున్నాను’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని