‘మీట్‌క్యూట్‌’లో ఆకాంక్ష

కథానాయకుడు నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మీట్‌క్యూట్‌’. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పలు కథల సమాహారంగా రూపొందుతున్న ఈ

Published : 06 Jul 2021 01:26 IST

థానాయకుడు నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మీట్‌క్యూట్‌’. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పలు కథల సమాహారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎనిమిది మంది కథానాయికలు సందడి చేయనున్నట్టు సమాచారం. అందులో ఒక ప్రధాన పాత్రని ఆకాంక్షసింగ్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ చిత్రం కోసం రంగంలోకి దిగింది. నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’లో ఆకాంక్షసింగ్‌ నాయికగా నటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని