Ravi teja: ‘రామారావు’.. ఆన్‌ డ్యూటీ

రవితేజ కథానాయకుడిగా కొత్త దర్శకుడు శరత్‌ మండవ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘రామారావు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆన్‌ డ్యూటీ.. అన్నది ఉపశీర్షిక. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ఫార్మల్‌ దుస్తులు...

Updated : 13 Jul 2021 05:58 IST

వితేజ కథానాయకుడిగా కొత్త దర్శకుడు శరత్‌ మండవ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘రామారావు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆన్‌ డ్యూటీ.. అన్నది ఉపశీర్షిక. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ఫార్మల్‌ దుస్తులు ధరించి.. ట్రెండీ గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో ప్రభుత్వ వాహనంతో పాటు ఆయన ప్రమాణ స్వీకార పత్రం, మెజిస్ట్రేట్‌ కార్యాలయం బోర్డులను చూపించారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ విభిన్నమైన థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని