ఈ సినిమాతో కొత్త సుశాంత్‌ని చూపించారు

‘‘ప్రపంచం మొత్తంలో థియేటర్‌కి రావడానికి సాహసిస్తున్నది తెలుగు జాతి మాత్రమే. మంచి కంటెంట్‌ సృష్టించి... మరింత  ముందుకు వెళదాం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. ఆయన

Updated : 25 Aug 2021 13:06 IST

‘‘ప్రపంచం మొత్తంలో థియేటర్‌కి రావడానికి సాహసిస్తున్నది తెలుగు జాతి మాత్రమే. మంచి కంటెంట్‌ సృష్టించి... మరింత  ముందుకు వెళదాం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మీనాక్షి చౌదరి కథానాయిక. ఎస్‌.దర్శన్‌ దర్శకుడు. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘సుశాంత్‌ ‘చి.ల.సౌ’తో తనని కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అది చూశాకే ‘అల...  వైకుంఠపురములో’ చిత్రంలో నటించమని అడిగాను. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ సాధిస్తాడు. మన సినిమా.. థియేటర్లలోనూ, టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ సందడి చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నుంచి మనందరం బయటికొచ్చి పనిచేసుకునే రోజులు రావాలి. అది ఈ సినిమాతోనే మొదలవ్వాలి’’ అన్నారు. నిర్మాత రవిశంకర్‌ శాస్త్రి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ ‘‘అందం, తెలివి, కష్టపడే మనస్తత్వం సుశాంత్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలోని తన పాత్రలో ఆ మూడూ కనిపిస్తాయి’’ అన్నారు. సుశాంత్‌ మాట్లాడుతూ ‘‘‘చి.ల.సౌ’కి ముందు నాగార్జున మామ  ‘స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో’ అని సలహా ఇచ్చారు. ఆ సినిమా నుంచి నా శైలిలో నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టా. దర్శన్‌ ఈ సినిమాతో కొత్త సుశాంత్‌ని చూపించార’’న్నారు. వెంకట్‌, శ్రీనివాస్‌ అవసరాల, కిరణ్‌, వి.ఎన్‌.ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని