Clap: ఆది పరుగు

క్రీడా నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు   విరివిగా రూపొందుతున్నాయి. అందులో ‘క్లాప్‌’ ఒకటి. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించారు. ఆయన ఇందులో పరుగుల వీరుడిగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య  

Updated : 21 Jan 2023 16:48 IST

క్రీడా నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు విరివిగా రూపొందుతున్నాయి. అందులో ‘CLAP’ ఒకటి. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించారు. ఆయన ఇందులో పరుగుల వీరుడిగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్షసింగ్‌ నాయిక. రామాంజనేయులు జవ్వాజి, ఎమ్‌.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సోమవారం హైదరాబాద్‌లో  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నా స్నేహితుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి బహుముఖ నటుడు. అతన్ని మా కుటుంబ సభ్యుడిలా భావిస్తాం. కొత్త దర్శకులు సినిమాకి ఏం కావాలో వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. వారి ప్రతిభని పూర్తిగా ప్రదర్శిస్తారు. ఈ సినిమా కోసం క్రీడా నేపథ్యానికి ఎంచుకోవడం మంచి ఆలోచన. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన క్రీడా నేపథ్య కథలేవీ ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు’’ అన్నారు. టీజర్‌ చివరన కనిపించే దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆది పినిశెట్టి అథ్లెట్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, బ్రహ్మాజీ, మైమ్‌గోపి, మునిష్కాంత్‌  నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: ప్రవీణకుమార్‌, మాటలు: వనమాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని