‘లైగర్‌’ యాక్షన్‌ షురూ

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌.. అనేది ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 16 Sep 2021 12:41 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌.. అనేది ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ బుధవారం గోవాలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్‌ స్పాట్‌లోని విజయ్‌ దేవరకొండ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో విజయ్‌ ఒంటిపై చొక్కా లేకుండా బాక్సింగ్‌ రింగ్‌లో వెనక్కి తిరిగి కూర్చొని కనిపించాడు. ‘‘రక్తం.. చెమట.. హింస’’ అంటూ దేవరకొండ ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యను జత చేశాడు. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. విజయ్‌ మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్‌లో ఆయనతో పాటు విదేశీ ఫైటర్లపై కీలక పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు శర్మ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని