Rakul Preet Singh: ప్రేమలో రకుల్‌

కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రేమలో పడింది. ఇది సినిమాలకి సంబంధించిన ముచ్చటేమీ కాదు. వ్యక్తిగత జీవితంలో తన చెలికాడు దొరికాడని ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా స్వయంగా వెల్లడించింది రకుల్‌. ఆదివారం ఆమె పుట్టినరోజు.

Updated : 11 Oct 2021 05:55 IST

థానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రేమలో పడింది. ఇది సినిమాలకి సంబంధించిన ముచ్చటేమీ కాదు. వ్యక్తిగత జీవితంలో తన చెలికాడు దొరికాడని ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా స్వయంగా వెల్లడించింది రకుల్‌. ఆదివారం ఆమె పుట్టినరోజు. తన ప్రేమ కబురుని  బయటకి చెప్పడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుందని భావించినట్టుంది రకుల్‌. ఇంతకీ ఆమె మనసు దోచిన ఆ  చెలికాడు ఎవరో తెలుసా? హిందీ నటుడు, నిర్మాత... జాకీ భగ్నానీ. ఇతను హిందీలో పలు చిత్రాలు నిర్మించిన వశు భగ్నానీ తనయుడే. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నిర్మాతగానే కాకుండా... నటుడిగానూ కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన ‘మిత్రోన్‌’తోపాటు... ‘ఫాల్తు’, ‘అజబ్‌ గజబ్‌ లవ్‌’, ‘యంగిస్థాన్‌’, ‘వెల్‌కమ్‌ టు కరాచీ’ తదితర చిత్రాల్లో నటించారు. ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘కూలీ నంబర్‌ 1’, ‘బెల్‌బాటమ్‌’ తదితర చిత్రాల్ని నిర్మించారు. కొన్నాళ్లుగా బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్‌... ఈ ఏడాదే భగ్నానీతో ప్రేమలో పడినట్టు ఆమె సామాజిక మాధ్యమల్లో చేసిన వ్యాఖ్యల్నిబట్టి తెలుస్తోంది. ‘‘ఈ ఏడాది నేను అందుకున్న అతి పెద్ద బహుమతి నువ్వే. నా జీవితంలో రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తున్నందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతలు నా ప్రేమ’’ అనే వ్యాఖ్యతో పాటు, భగ్నానీ చేతిలో చెయ్యేసి నడుస్తున్న ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రకుల్‌. అది చూసిన పలువురు తోటి నటులు, సన్నిహితులు రకుల్‌కి అభినందనలు తెలిపారు. ఇటీవలే ఆమె నటించిన తెలుగు చిత్రం ‘కొండపొలం’ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని