Rajinikanth: ‘పెద్దన్న’.. ఉప్పెనరా

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రానుంది. డి.సురేష్‌బాబు, నారాయణ దాస్‌ కె.నారంగ్‌  నిర్మాతలు. నయనతార, కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 24 Oct 2021 05:59 IST

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రానుంది. డి.సురేష్‌బాబు, నారాయణ దాస్‌ కె.నారంగ్‌  నిర్మాతలు. నయనతార, కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హీరో వెంకటేష్‌ టీజర్‌ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. రజనీ లుక్స్‌, నటన చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ‘‘పల్లెటూరోడ్ని శాంతంగానే చూసుంటావు. కోప్పడి చూడలేదు కదా. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’’ అంటూ టీజర్‌లో రజనీ పలికిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని