Manchu Vishnu: నాయికలకి గౌరవం ఇవ్వాలి

‘‘మహిళలు తల్లితో సమానం. కథానాయికలకి తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్ల గురించి అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు పెడితే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చూస్తూ ఊరుకోద’’న్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. కొన్ని యూ ట్యూబ్‌

Updated : 25 Oct 2021 06:05 IST

‘‘మహిళలు తల్లితో సమానం. కథానాయికలకి తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్ల గురించి అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు పెడితే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చూస్తూ ఊరుకోద’’న్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. కొన్ని యూ ట్యూబ్‌ ఛానళ్ల రాతలు హద్దులు మీరుతున్నాయని ఆయన చెప్పారు. ఇటీవలే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుని తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆదివారం హైదరాబాద్‌లో సన్మానించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. ‘‘పరిధి దాటే యూ ట్యూబ్‌ ఛానళ్లని నియంత్రించేందుకు ఓ సెల్‌ని ఏర్పాటు చేస్తాం. అది మా ఎజెండాలో ఓ భాగం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి శివబాలాజీ, ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభు, ఇతర కార్యవర్గం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని