
Puneeth Rajkumar: పునీత్‌కు అశ్రు నివాళి
అభిమానుల కన్నీళ్లు... చిత్రపరిశ్రమలోని ప్రముఖుల విషాదవదనాలు... బంధుమిత్రుల శోకాలు... బెంగళూరు దుఃఖ సాగరమైంది.
గుండెపోటుతో శుక్రవారం మృతి చెందిన కన్నడ యువ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు తెలుగు చిత్ర ప్రముఖులు కదలివచ్చారు. వివిధ చిత్రపరిశ్రమలకు చెందిన యువ, సీనియర్ నటులంతా సామాజిక మాధ్యమాల్లో పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని... సంతాపం ప్రకటించారు. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పునీత్ పార్ధివ శరీరాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, మంచు మనోజ్, నరేశ్, శివబాలాజీ తదితరులు పునీత్‌కు నివాళులర్పించారు. కోలీవుడ్ నుంచి శరత్‌కుమార్, ప్రభుదేవ తదితరులు పునీత్‌ను కడసారి చూసి కన్నీటిసంద్రమయ్యారు. లక్షలాది మంది అభిమానులు నివాళి అర్పించారు.
- ఈనాడు డిజిటల్, బెంగళూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.