Updated : 31/10/2021 05:29 IST

Varudu Kaavalenu: బలంగా నమ్మాను... అదే నిజమైంది

‘‘మొదటినుంచీ ‘వరుడు కావలెను’ కథని బలంగా నమ్మాను. థియేటర్లకి వచ్చిన కుటుంబ ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చింది. కథపై నాకున్న నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. రీతూవర్మ కథా నాయిక. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘సినిమా బాగుందనే టాక్‌ పెరుగుతోంది. ఈ విజయం వెనక ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. నేను లవర్‌ బాయ్‌ ఇమేజ్‌కి దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలనుకుంటా. ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘‘కథలో మేం అనుకున్న భావోద్వేగాలు తెరపై పండాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకి వస్తూ మా సినిమాని ఆస్వాదిస్తున్నారు. నాగశౌర్య నాకు అందించిన సహకారం మరిచిపోలేను. సితార సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులోనూ కుటుంబ వినోదంతో కూడిన సినిమాలే చేస్తా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సినిమా బాగుండటంతో ప్రతీ ఆటకీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఒక కొత్త దర్శకురాలిని తీసుకొచ్చి మా సంస్థకి విజయాన్ని అందించిన హీరో నాగశౌర్యకి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత గణేశ్‌ రావూరి, నటులు ప్రవీణ్‌, హిమజ, అర్జున్‌, నృత్య దర్శకుడు విజయ్‌, గీత రచయిత గోసాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని