RRR: 45 సె‘కనుల పండగ’

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒలీవియా మోరిస్‌, అలియా...

Updated : 31 Oct 2021 05:50 IST

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒలీవియా మోరిస్‌, అలియా భట్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. 45 సెకనుల నిడివితో ఉండే ఆ వీడియో గ్లింప్స్‌ను నవంబర్‌ 1న ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో చరణ్‌, ఎన్టీఆర్‌ సీరియస్‌ లుక్స్‌తో కనిపించారు. 1920ల నేపథ్యంలో సాగే చిత్రమిది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తిగా అల్లుకున్న ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అల్లూరిగా చరణ్‌ నటిస్తుండగా.. భీమ్‌ పాత్రను తారక్‌ పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సెంథిల్‌ కుమార్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని