
Updated : 27 Nov 2021 08:00 IST
Anasuya: అనసూయ ఆకర్షణ
ప్రత్యేక గీతాల్లోనే కాదు... బలమైన పాత్రల్లోనూ సందడి చేస్తుంటుంది అనసూయ. ఆమె ప్రధాన పాత్రధారిగా ‘ఫ్లాష్‌బ్యాక్’ తెరకెక్కింది. రెజీనా, ప్రభుదేవా ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనసూయ అందం, అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ఈ సినిమా లుక్‌ని విడుదల చేశారు. రెజీనా ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా, అనసూయ.. ప్రభుదేవా విభిన్నమైన పాత్రల్లోనూ సందడి చేస్తారని దర్శకనిర్మాతలు తెలిపారు. బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెలుగులో ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు.
Tags :