
Cinema News: ‘ఏది నిజం?’ ఆరంభం
నవతరం నటులు రవికుమార్, ఐశ్వర్య హన్విక నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏది నిజం?’. సంపత్ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ఆత్రేయ, లక్ష్మణ్‌రావు, మహేష్ చౌదరి, చంద్రమోహన్ నిర్మాతలు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. సీనియర్ నటులు బాబుమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రీకరణ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మంచి కథతో ఈ సినిమా చేస్తున్నారు. కొత్తతరం నటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పల్లెటూరు పట్టణ ప్రాంతాల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యలే ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నాం. ఐదు ప్రత్యేకమైన పాత్రల్లో ప్రధాన నటులు నటిస్తార’’న్నారు. నాయకానాయికలతోపాటు, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జబర్దస్త్ అప్పారావు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రాన్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.