
Updated : 28 Nov 2021 08:53 IST
Sirivennela Sitaramasastri: సిరివెన్నెలకి అస్వస్థత
ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకి గురయ్యారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల న్యూమెనియాతో బాధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Tags :