IFFI: ‘ఇఫి’లో మెరిసిన ‘రింగు వాండరింగ్‌’

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ‘రింగు వాండరింగ్‌’ సత్తా చాటింది. గోవాలో ఆదివారంతో ముగిసిన ఈ 52వ ఇఫి వేడుకల్లో ఈ సినిమా గోల్డెన్‌ పికాక్‌  అవార్డుతో పాటు రూ.40లక్షల నగదు

Updated : 29 Nov 2021 08:29 IST

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ‘రింగు వాండరింగ్‌’ సత్తా చాటింది. గోవాలో ఆదివారంతో ముగిసిన ఈ 52వ ఇఫి వేడుకల్లో ఈ సినిమా గోల్డెన్‌ పికాక్‌  అవార్డుతో పాటు రూ.40లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. ఔత్సాహిక మాంగా  కళాకారుడి జీవన ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని.. ప్రముఖ జపనీస్‌ రచయిత, దర్శక నిర్మాత మసకాజు కనెకో తెరకెక్కించారు. ‘సేవింగ్‌ వన్‌ హూ వాజ్‌ డెడ్‌’ చిత్రానికి గాను వాక్లావ్‌ కడ్రంకాకు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘సేక్రెడ్‌ గేమ్స్‌’తో ప్రాచుర్యం పొందిన నటుడు జితేంద్ర జోషి.. మరాఠి సినిమా ‘గోదావరి’లోని నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రానికి గానూ దర్శక నిర్మాత మహాజన్‌ ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. పరాగ్వే చిత్రం ‘చార్లెట్‌’లో తనదైన నటనతో మెప్పించిన ఏంజెలా మోలినా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక ఇఫితో పాటే నిర్వహించిన బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘అసురన్‌’ సినిమాకి గానూ ధనుష్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇఫి ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌తో పాటు మనోజ్‌ బాజ్‌పేయి, రణధీర్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని