Srinu Vaitla: శ్రీనువైట్లకి పితృవియోగం

సినీ దర్శకుడు శ్రీనువైట్ల తండ్రి కృష్ణారావు(84) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈయన పార్థివదేహాన్ని స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా

Updated : 29 Nov 2021 08:30 IST

సినీ దర్శకుడు శ్రీనువైట్ల తండ్రి కృష్ణారావు(84) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈయన పార్థివదేహాన్ని స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కందులపాలెం తీసుకొచ్చారు. సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయనకి కుమారుడు శ్రీనువైట్లతోపాటు, కుమార్తె ఉన్నారు.

- న్యూస్‌టుడే, ద్రాక్షారామ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని