RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హంగామా 3న

సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ సినిమాని ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించారు. ఇది సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలకు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది.

Updated : 30 Nov 2021 05:42 IST

సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ సినిమాని ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించారు. ఇది సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలకు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైలర్‌ను డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తారక్‌, చరణ్‌, అలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌లతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

‘‘బిగ్గెస్ట్‌ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. ఇక వేడుకలు ప్రారంభించండి’’ అంటూ ఆ పోస్టర్‌కు చిత్ర బృందం ఓ వ్యాఖ్యను కూడా జోడించింది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఓ కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. అల్లూరి పాత్రను చరణ్‌ పోషించగా.. భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని