Updated : 01/12/2021 09:29 IST

Sehari: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

ర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ దర్శకుడు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదొక చక్కని రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయ’’న్నారు. ‘‘హర్ష్‌ కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశారు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాం. ఈ సినిమా కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూడగలిగేలా ఉంటుంద’’న్నారు నిర్మాత జిష్ణు రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథ్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని