Lakshya: పది పలకల దేహమైనా చేస్తా!

పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం అని నిరూపించిన ఓ కుర్రాడి కథేమిటో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి

Updated : 02 Dec 2021 09:30 IST

- నాగశౌర్య

డి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం అని నిరూపించిన ఓ కుర్రాడి కథేమిటో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌  రామ్మోహన్‌రావు, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ విడుదల చేశారు. బుధవారం చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘విలువిద్య మీద నేను చేసిన మొదటి సినిమా ఇది. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకొనే వారి చేతిలో విల్లుని చూస్తాం. అన్నింటినీ ఆటలు అంటాం కానీ, ఆర్చరీని విలువిద్య అంటాం. నేను రాసుకున్న ఈ కథని నమ్మి అవకాశం ఇచ్చారు నిర్మాతలు. నేను రాసుకున్నది నలభై శాతమైతే, వంద శాతాన్ని చేశారు కథానాయకుడు. మూడు రోజులు కనీసం మంచినీళ్లు తాగకుండా ఎనిమిది పలకల దేహంతో నటించారు. రితిక పాత్రలో కేతికశర్మ చక్కటి  అభినయం ప్రదర్శించింది. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ పాత్రలు చాలా బాగుంటాయి. రెండున్నరేళ్ల కష్టం ఈ సినిమా’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘క్రీడా నేపథ్యంలో సినిమా అంటే హీరో గెలవాలి, ప్రేమకథ అంటే అమ్మాయి, అబ్బాయి కలవాలి. ఈ చిత్రంలోనూ అంతే కానీ, ఇందులో హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తికరం. ఈ కథ 8 పలకల దేహం కోరింది. నేను చేశా. పాత్ర కోరితే పది పలకల దేహమైనా చేస్తా. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌లతో కలిసి నటించడం మంచి అనుభవం. వారివల్లే నాలోని  నటుడిని బయటికి తీసుకు రావాలనే కోరిక పుట్టింది’’ అన్నారు. నిర్మాత రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ ‘‘క్రీడా నేపథ్యంతో కూడిన సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అందరిలోనూ దీనిపై ఆసక్తి ఏర్పడింది. నాగశౌర్య చాలా కష్టపడి పనిచేశార’’న్నారు. కేతిక శర్మ, జానవి తదితరులు
పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని