
Updated : 02 Dec 2021 09:19 IST
Kamal Hassan: పూర్తిగా కోలుకున్న కమల్‌హాసన్
నటుడు, మక్కల్‌నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. స్వల్పమైన దగ్గు సమస్యతో కమల్ నవంబరు 22న చెన్నై శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆస్పత్రివర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో.. కమల్‌హాసన్ కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే ఈనెల 3వతేది వరకు ఐసోలేషన్‌లో ఉంటారు. నాలుగోతేది నుంచి ఆయన ఎప్పటిలాగే తన కార్యకలాపాలు చేసుకోవచ్చని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
- న్యూస్‌టుడే, కోడంబాక్కం
Tags :