Updated : 02/12/2021 07:07 IST

Shani Salmon: శివన్న పాత్రతో గుర్తింపు

అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌ ప్రధాన పాత్రల్లో   నటించిన చిత్రం ‘రామ అసుర్‌’. వెంకటేష్‌ త్రిపర్ణ తెరకెక్కించారు. షానీ సాల్‌మాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు షానీ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం విజయం సాధించడం నా జీవితంలో కీలక మలుపు. ఇందులో పోషించిన శివన్న పాత్రతో గుర్తింపు మరింత పెరిగింది. ఏ విజయోత్సవ వేడుకకు వెళ్లినా శివన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇక్కడి వరకు వచ్చా. ప్రస్తుతం నేను చేసిన ‘కిన్నెరసాని’, ‘అమరన్‌’, ‘గ్రే’, ‘పంచతంత్ర కథలు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మంచి నటుడిగా ఎదిగి.. చిత్ర రంగంలోని పేద, వృద్ధ కళాకారులను ఆదుకోవాలన్నది నా లక్ష్యం’’ అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని