Updated : 02/12/2021 07:04 IST

Nayeem Diaries: 10న ‘నయీం డైరీస్‌’

పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన చిత్రమిది. వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’న్నారు. యజ్ఞశెట్టి,దివి, బాహుబలి నిఖిల్‌, శశికుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్‌ భార్గవ్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని