యశ్‌రాజ్‌ వెబ్‌సిరీస్‌ ‘ద రైల్వే మెన్‌’

ప్రముఖ బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నుంచి తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ రాబోతుంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఆధారంగా ఈ సిరీస్‌ ఉండనుంది. ఈ సిరీస్‌కు ‘ద రైల్వే మెన్‌’ అనే పేరుని ఖరారు

Published : 03 Dec 2021 01:20 IST

ప్రముఖ బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నుంచి తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ రాబోతుంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఆధారంగా ఈ సిరీస్‌ ఉండనుంది. ఈ సిరీస్‌కు ‘ద రైల్వే మెన్‌’ అనే పేరుని ఖరారు చేస్తూ పాత్రల్ని పరిచయం చేస్తూ ఓ చిన్న వీడియోని విడుదల చేశారు. ఆర్‌.మాధవన్‌, కేకే మీనన్‌, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్‌ఖాన్‌ తనయుడు బాబిల్‌ ఖాన్‌ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1984 డిసెంబరు 2 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన 37 ఏళ్లకు యశ్‌రాజ్‌ సంస్థ వెబ్‌సిరీస్‌ను ప్రకటించడం విశేషం. ఈ సిరీస్‌ వచ్చే ఏడాది డిసెంబరు 1 నుంచి ప్రసారం కానుంది. ‘‘భోపాల్‌ స్టేషన్‌లోని రైల్వే కార్మికులకు నివాళిగా ఈ షోను నిర్మిస్తున్నాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనతో అనేకమంది జీవితాలు నాశనం అయ్యాయి. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలియాలి’’అని యశ్‌రాజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిరీస్‌ను శివ్‌ రవైల్‌ తెరకెక్కించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని