
Updated : 04 Dec 2021 11:36 IST
Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి ‘అడవి తల్లి మాట’.. పాట వచ్చేసింది
హైదరాబాద్: ‘భీమ్లానాయక్’ పాటల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట... అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని శనివారం విడుదల చేశారు. పవన్‌కల్యాణ్, రానా కథానాయకులుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రివిక్రమ్ రచన చేస్తున్నారు. తమన్ స్వరకర్త. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Tags :