ప్రేమ రంగు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కూనం కృష్ణకుమారి సమర్పకులు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 04 Dec 2021 02:18 IST

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కూనం కృష్ణకుమారి సమర్పకులు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాసరావు చేతులమీదుగా విడుదలైంది. టీజర్‌కి లభిస్తున్న స్పందన పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కలర్స్‌ ఆఫ్‌ లవ్‌ అనే శీర్షికతో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రేమలోని రంగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికర’’మన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని