కన్నడ నటుడు శివరామ్‌ కన్నుమూత

సీనియర్‌ కన్నడ నటుడు ఎస్‌.శివరామ్‌(83) కన్నుమూశారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స జరుగుతుండగానే శనివారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు   వెల్లడించారు.

Published : 05 Dec 2021 03:05 IST

సీనియర్‌ కన్నడ నటుడు ఎస్‌.శివరామ్‌(83) కన్నుమూశారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స జరుగుతుండగానే శనివారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు   వెల్లడించారు. ఆరు దశాబ్దాలుగా కన్నడనాట పలు చిత్రాల్లో నటించిన ఆయన ‘దుడ్డే దొడ్డప్ప’, ‘లగ్న పత్రికే’, ‘నాగరహావు’, ‘ననోబ్బా కల్ల’, ‘యజమాన’, ‘ఆప్తమిత్ర’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ రాణించారు. రజనీకాంత్‌ కథనాయకుడిగా తమిళంలో ‘ధర్మాదురై’ అనే చిత్రాన్ని నిర్మించారు శివరామ్‌. ఆయన పలు ధారావాహికల్లోనూ నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని