ఈనెల 9న.. థియేటర్లలో

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం సినీ ప్రియులకు శుభవార్త వినిపించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 3నే విడుదల చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ట్రైలర్‌ను ఈనెల 9న ఉదయం 10గంటలకు సామాజిక మాధ్యమాలతో పాటు థియేటర్లలోనూ విడుదల 

Published : 05 Dec 2021 03:05 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం సినీ ప్రియులకు శుభవార్త వినిపించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 3నే విడుదల చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ట్రైలర్‌ను ఈనెల 9న ఉదయం 10గంటలకు సామాజిక మాధ్యమాలతో పాటు థియేటర్లలోనూ విడుదల   చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందించారు. భీమ్‌ పాత్రను తారక్‌ పోషించగా.. అల్లూరిగా చరణ్‌ నటించారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: కీరవాణి, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, నిర్మాత: డీవీవీ దానయ్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని