ఆస్కార్‌ ఓటింగ్‌లోనూ విజయం సాధిస్తాం

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా దీపక్‌ రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’. గజ్జల శిల్ప నిర్మించారు. ధృషిక చందర్‌, శ్రీవల్లి రాఘవేందర్‌, పృథ్వీ శర్మ కథానాయికలు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘు చిత్రం పలు... 

Published : 07 Dec 2021 01:58 IST

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా దీపక్‌ రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’. గజ్జల శిల్ప నిర్మించారు. ధృషిక చందర్‌, శ్రీవల్లి రాఘవేందర్‌, పృథ్వీ శర్మ కథానాయికలు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘు చిత్రం పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ క్వాలిఫైలో ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ఈనెల 10న ఓటింగ్‌ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విరాజ్‌ మాట్లాడుతూ ‘‘దీపక్‌ ఈ కథ చెప్పినప్పుడు.. చెప్పినట్లుగా స్క్రీన్‌పైకి తీసుకురాగలడా అనుకున్నా. కానీ, దాన్ని బాగా తీసి చూపించాడు. దీన్ని తమిళంలో గౌతమ్‌ మేనన్‌, కన్నడలో ‘కేజీఎఫ్‌’ సహ నిర్మాత విడుదల చేశారు. ఓ తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌కు 900పైగా అవార్డులు రావడం గర్వంగా ఉంది. ఆస్కార్‌ క్వాలిఫై ఓటింగ్‌పై నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రానికే ఇంత గుర్తింపు రావడం నమ్మలేకపోతున్నా’’ అంది నాయిక ధృషిక. దర్శకుడు దీపక్‌ మాట్లాడుతూ ‘‘ప్రేమకథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలనుకున్నప్పుడు.. పూర్తిగా రివర్స్‌ స్క్రీన్‌ప్లేతో మ్యూజికల్‌గా చేద్దామని అనుకున్నా. ఇలా కథ మొత్తాన్ని రివర్స్‌లో తీయడమే చాలా పెద్ద సవాల్‌. మంచి టీమ్‌తో అనుకున్నది సాధించాం. ఈనెల 10న ఆస్కార్‌ ఓటింగ్‌లోనూ విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు రాజ్‌, సంగీత దర్శకుడు కమ్రాన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని