కొత్తతరం నటులతో...

పదేళ్లకుపైగా డిజిటల్‌ సినిమా రంగంలో ఉన్న అనుభవమే పెట్టుబడిగా మూడు చిత్రాల్ని నిర్మిస్తున్నామని తెలిపారు యంగ్‌ మంత్ర వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్‌. త్వరలోనే కొత్తతరం నటీనటులతో....

Published : 07 Dec 2021 01:58 IST

దేళ్లకుపైగా డిజిటల్‌ సినిమా రంగంలో ఉన్న అనుభవమే పెట్టుబడిగా మూడు చిత్రాల్ని నిర్మిస్తున్నామని తెలిపారు యంగ్‌ మంత్ర వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్‌. త్వరలోనే కొత్తతరం నటీనటులతో మరో చిత్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ‘‘బలమైన కథలతో... నాణ్యమైన సినిమాలు రూపొందించడమే లక్ష్యంగా మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. 500కిపైగా సినిమాలకి డిజిటల్‌ ప్రచారం చేసిన అనుభవం మాకు ఉంది. తెలుగులో డిజిటల్‌ ప్రచారం ప్రారంభించిన సంస్థల్లో మాది ఒకటి. సుదీర్ఘమైన అనుభవంతోనే ఓటీటీ వేదికలే లక్ష్యంగా మూడు సినిమాల్ని ప్రారంభించాం. త్వరలో ప్రారంభించనున్న సినిమా థియేటర్లలో విడుదల చేయడం కోసం నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత కటకం శ్రీకాంత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని