
ఆలోచింపజేసే రాజకీయ చిత్రం
ధర్మ, పవి జంటగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. జె.ప్రవీణ్ రెడ్డి నిర్మాత. గౌర హరి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ నివ్వగా.. నిర్మాత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీవిష్ణు, దర్శకుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ‘‘ఆలోచింపజేసే పొలిటికల్ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. డిసెంబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. ఈ సినిమాకి కూర్పు: జెస్విన్ ప్రభు, ఛాయాగ్రహణం: కేశవ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.