Pushpa: పుష్ప: ఫ్లవర్‌ కాదు... ఫైర్‌

‘ఈలోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే’ అంటున్నాడు పుష్పరాజ్‌. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ...’ అంటూ  గడుసైన సమాధానమే ఇస్తున్నాడు.

Updated : 07 Dec 2021 14:20 IST

‘ఈలోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే’ అంటున్నాడు పుష్పరాజ్‌. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ...’ అంటూ  గడుసైన సమాధానమే ఇస్తున్నాడు. మరి అతని కథేమిటో తెలియాలంటే ‘పుష్ప’ చిత్రం చూడాల్సిందే. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. రెండు  భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. అల్లు అర్జున్‌ భిన్నమైన గెటప్పు, అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, పోరాట ఘట్టాలు, సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని