రామ్‌.. భీమ్‌... గండర గండలు

కొండల్ని సైతం పిండి చేసేంత శక్తిమంతులుగా కనిపిస్తుంటారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సినిమాల్లోని కథానాయకులు. వాళ్ల హీరోయిజాన్ని తెరపైన చూడడానికి రెండు కళ్లు చాలవంతే. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో రామ్‌... భీమ్‌లైతే అంతకుమించి కనిపిస్తారని చెప్పకనే చెబుతున్నాయి

Published : 07 Dec 2021 01:58 IST

కొండల్ని సైతం పిండి చేసేంత శక్తిమంతులుగా కనిపిస్తుంటారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సినిమాల్లోని కథానాయకులు. వాళ్ల హీరోయిజాన్ని తెరపైన చూడడానికి రెండు కళ్లు చాలవంతే. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో రామ్‌... భీమ్‌లైతే అంతకుమించి కనిపిస్తారని చెప్పకనే చెబుతున్నాయి ప్రచార చిత్రాలు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారంలో జోరు పెంచింది ఆ చిత్రబృందం. సోమవారం రామరాజు పాత్రలోని రామ్‌చరణ్‌ లుక్‌ని, కొమరం భీమ్‌ పాత్రలోని ఎన్టీఆర్‌ లుక్‌ని విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లిద్దరూ కండలు తిరిగిన దేహాలతో కనిపిస్తూ సినిమాపై మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తున్నారు. సినిమాలో ఇంకెన్నో ఆకర్షణలు అంటూ ఊరిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ జనవరి 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ని ఈ నెల 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని