chhichhore: సుశాంత్‌ ‘ఛిఛోరే’ చైనాలో

బాలీవుడ్‌ సినిమాలకు ఎంత క్రేజ్‌ ఉందో ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమా నిరూపించింది. నితిష్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రం చైనా బాక్సాఫీసు వద్ద సుమారు రూ.1000కోట్లు వసూలు చేసింది.

Updated : 08 Dec 2021 07:10 IST

బాలీవుడ్‌ సినిమాలకు ఎంత క్రేజ్‌ ఉందో ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమా నిరూపించింది. నితిష్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రం చైనా బాక్సాఫీసు వద్ద సుమారు రూ.1000కోట్లు వసూలు చేసింది. దీంతో నితీష్‌ మరో చిత్రం ‘ఛిఛోరే’ కూడా చైనా ప్రేక్షకుల్ని అలరించనుంది. దివంగత బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన చిత్రమిది. తాజాగా చిత్రబృందం చైనా భాషలో ఉన్న ‘ఛిఛోరే’ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 7న చైనాలో విడుదల చేయనున్నారు. చివరగా థియేటర్‌లో విడుదలైన సుశాంత్‌ సింగ్‌ చిత్రమిది. ‘‘కరోనా పరిస్థితుల తర్వాత చైనాలో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రమిది. ఎన్ని స్క్రీన్లలో విడుదల చేయాలనే దానిపై ఇంకా స్పష్టత లేద’’ని చిత్రవర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని