Vikram Goud: ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు

కిరణ్‌ రాజ్‌, దీపికా సింగ్‌ జంటగా పాశం నరసింహారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌ గౌడ్‌’. సుహాసిని నిర్మాత. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Updated : 08 Dec 2021 07:13 IST

కిరణ్‌ రాజ్‌, దీపికా సింగ్‌ జంటగా పాశం నరసింహారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌ గౌడ్‌’. సుహాసిని నిర్మాత. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు సినిమాలో ఉన్నాయి. ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. ప్రథమార్ధమంతా లవ్‌, ద్వితీయార్ధమంతా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమా విడుదల చేస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌, డి.ఎస్‌.రావు, ‘మంత్ర’ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని