
Updated : 09 Dec 2021 09:34 IST
Khildai: ‘ఖిలాడి’ కోసం రవితేజ గానం
నాయకానాయికలు అప్పుడప్పుడు గాయకులుగా మారిపోతుంటారు. గొంతు సవరించుకుని హుషారుగా పాటలు పాడేస్తుంటారు. సంగీత దర్శకులూ తమ సినిమాల్లోని తారలతో పాటలు పాడించడానికి ఇష్టపడుతుంటారు. అగ్ర కథానాయకుడు రవితేజ ఇదివరకే అలా పాటలు పాడారు. తాజాగా ఆయన మరోసారి గళం విప్పారు. తన చిత్రం ‘ఖిలాడి’ కోసం ఓ హుషారైన గీతాన్ని ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
Tags :