Rajamouli: తారక్‌.. చరణ్‌.. విభిన్న ధ్రువాలు

‘‘ప్రపంచంలోని భారతీయులందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఎదురుచూస్తున్నారంటే కారణం ఎమోషన్స్‌. వాటితోనే ఈ సినిమాను రూపొందించా. అందుకు తారక్‌, చరణ్‌లే కారణం’’ అన్నారు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలసి నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

Updated : 28 Dec 2021 05:06 IST

- రాజమౌళి

‘‘ప్రపంచంలోని భారతీయులందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఎదురుచూస్తున్నారంటే కారణం ఎమోషన్స్‌. వాటితోనే ఈ సినిమాను రూపొందించా. అందుకు తారక్‌, చరణ్‌లే కారణం’’ అన్నారు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలసి నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ధాను, నటుడు, నిర్మాత ఉదయనిధి, హీరో శివకార్తికేయన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ ‘‘కొన్ని సినిమాలకు విజయం ఎలా సాధించాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ రాజమౌళి చిత్రాలకు అది ఉండదు. తప్పక ఇది కోలీవుడ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంటుంద’’ని అన్నారు. శివకార్తికేయన్‌ మాట్లాడుతూ ‘‘మగధీర’, ‘నాన్‌ఈ’ సినిమా చూసిన తర్వాత రాజమౌళికి పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. ఈగతోనే చేసిన ఆయన నాతో కూడా పెద్ద సినిమాను చేస్తారనే నమ్మకం కలిగింది. ప్రపంచ స్థాయిలో పెద్ద హిట్‌ను ఇచ్చి ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్‌కు సిద్ధమయ్యారు’’ అని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాకు చెన్నైకి వస్తేనే స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ను, పాఠశాలను చూసినట్లు ఉంటుంది. తారక్‌లాంటి యాక్టర్‌ దొరకడం తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా, భారతీయ సినీ పరిశ్రమకే ఓ అదృష్టం. చరణ్‌ నా హీరో. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. చాలాకూల్‌గా ఎలా పని చేయాలో చరణ్‌ నుంచి నేర్చుకున్నా. ఇద్దరూ విభిన్న ధ్రువాలు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అయస్కాంతానికి అతుక్కుపోయారు. వారివల్ల సంతోషపడుతున్న వ్యక్తిని నేను. ‘బాహుబలి’ నచ్చినట్లయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా తప్పక నచ్చుతుంద’’న్నారు. కార్యక్రమంలో డీవీవీ దానయ్య, ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

-  న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని