ఆసక్తికర ‘ముఖచిత్రం’

వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్‌ దర్శకుడు. ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి 

Published : 11 Jan 2022 02:06 IST

వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్‌ దర్శకుడు. ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి సోమవారం విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ప్రియ వడ్లమాని రెండు పాత్రల్లో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ఓ పాత్రలో ఆధునిక యువతిగా కనిపించగా.. మరో పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా దర్శనమిచ్చింది. ‘‘ఫన్‌ అండ్‌ ఇంటెన్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి ‘కలర్‌ఫొటో’ ఫేమ్‌ సందీప్‌రాజ్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం: బి.శ్రీనివాస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు