కథలే చెబుతాయి

కథానాయికల పాలిట తెలుగు తెర ఓ పుష్పకవిమానం. ఎంతమంది వచ్చినా మరొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులు తమ కథానాయిక అని సొంతం చేసుకొనేంతగా ప్రభావం చూపే భామలు మాత్రం అరుదు

Published : 15 Jan 2022 02:30 IST

థానాయికల పాలిట తెలుగు తెర ఓ పుష్పకవిమానం. ఎంతమంది వచ్చినా మరొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులు తమ కథానాయిక అని సొంతం చేసుకొనేంతగా ప్రభావం చూపే భామలు మాత్రం అరుదు. అగ్ర కథా నాయిక పూజాహెగ్డే అయితే తెలుగమ్మాయిలాగే మారిపోయింది. తెలుగు పలుకులతో తన పాత్రలకి తెలుగుదనాన్ని ఒలికిస్తున్నారు. అందుకే ఆమెని వరుసగా అవకాశాలు వరిస్తున్నాయి. గతేడాది నాకు తెలుగు ప్రేక్షకుల అభిమానం మరింతగా హృదయాన్ని తాకిందని చెబుతోంది పూజ. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై నాకు ఎప్పుడో గురి ఏర్పడిందని చెబుతోంది పూజ. ‘‘తెలుగు వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎంతో కాలం పట్టలేదు. నేను కన్నడ అమ్మాయిని కావడంతోనేమో. కొన్నిసార్లు మేం వినే కథలు, చేసే పాత్రలే... సంస్కృతి సంప్రదాయాలు అర్థమయ్యేలా చేస్తాయి. సినిమా ప్రత్యేకత అదే’’ అని చెప్పుకొచ్చింది పూజ. ఈ ఏడాది ఆమె వివిధ భాషల్లో చేసిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని