Published : 15 Jan 2022 02:35 IST

‘రావణాసుర’ ప్రారంభం

వితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మానుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. యువ కథానాయకుడు సుశాంత్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అభిషేక్‌ నామా నిర్మాత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకులు కె.ఎస్‌.రవీంద్ర, గోపీచంద్‌ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ‘రావణాసుర’ పోస్టర్‌ని చిరంజీవి ఆవిష్కరించారు. ‘‘ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా రవితేజని ఓ విభిన్నమైన పాత్రలో ఆవిష్కరించనున్నారు దర్శకుడు. ఈ నెలలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెడతామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. రావు రమేష్‌, మురళీశర్మ, సంపత్‌రాజ్‌, నితిన్‌ మెహతా, సత్య, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్‌‘్స, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌, కూర్పు: శ్రీకాంత్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని