
ఏప్రిల్‌లో సెట్స్‌పైకి?
కథానాయకుడు మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మహేష్ నటిస్తున్న ఈ 28వ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈపాటికే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తివ్రిక్రమ్, మహేష్ ప్రాజెక్ట్‌పైకి దృష్టి సారించినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం ఆయన తమన్‌తో కలిసి సంగీత చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిత్ర ప్రధాన తారాగణం కోసం వేట ముమ్మరం చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్‌కు విలన్‌గా సునీల్ శెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలో స్పష్టత రానున్నట్లు తెలిసింది. ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి విజయాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్‌ల కలయిక నుంచి రానున్న సినిమా కావడంతో.. సినీప్రియుల్లో దీనిపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
Advertisement