మది మదినీ కదిలించే సరికొత్త ధారావాహిక మనసంతా నువ్వే..

ఓ అందమైన అమ్మాయి...అంతులేని ఐశ్వర్యం..ఆప్యాయతలు పంచే పొందికైన కుటుంబం..అన్ని అర్హతలూ ఉన్న ఓ అబ్బాయి విదేశాల నుంచి వచ్చి ‘మనసంతా నువ్వే’ అన్నాడు. అయినా..ఆ ప్రేమ

Updated : 18 Jan 2022 04:23 IST

ఓ అందమైన అమ్మాయి...అంతులేని ఐశ్వర్యం..ఆప్యాయతలు పంచే పొందికైన కుటుంబం..అన్ని అర్హతలూ ఉన్న ఓ అబ్బాయి విదేశాల నుంచి వచ్చి ‘మనసంతా నువ్వే’ అన్నాడు. అయినా..ఆ ప్రేమ ప్రయాణానికి అడుగడుగునా ముళ్ల బాటలే ఎదురయ్యాయి. అయినవాళ్ల అనురాగాలే ప్రేమకి ప్రతిబంధకాలైతే...మంచి మనసులే ప్రేమికులకు పెనుశాపాలైతే..??

రేపటి నుంచి మనసంతా నువ్వే డైలీ సీరియల్‌

సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30గం.లకు ఈటీవీలో

అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సాగే సరికొత్త ధారావాహిక ‘మనసంతా నువ్వే’ రేపటి నుంచి ప్రతి రాత్రి 8.30 గం.లకు ఈటీవీలో ప్రారంభమవుతోంది. రాధాకృష్ణ టాకీస్‌ నిర్మిస్తున్న ఈ డైలీసీరియల్‌కు మలినేని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది కేవలం ఒక అబ్బాయి- అమ్మాయి మధ్య నడిచే వినూత్నమైన ప్రేమ కథ మాత్రమే కాదు..ఒక అన్నకి-చెల్లెకి మధ్య విడదీయలేని అనుబంధం వల్ల జరిగే ఘర్షణని, ఇద్దరు స్నేహితుల మధ్య అంతులేని అభిమానం వల్ల జరిగే సంఘర్షణనీ ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కథాకథనాలతో అందిస్తుంది ‘మనసంతా నువ్వే’. ఇందులోని భావోద్వేగాలు అన్ని వయసుల వారినీ అమితంగా ఆకట్టుకుంటాయని ధృడంగా నమ్ముతున్నాం’’ అన్నారు. సీరియల్‌లో ముఖ్య పాత్రలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్‌ భార్గవ్‌ మాట్లాడుతూ ‘‘చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఇంత కథాబలం కలిగిన ధారావాహికలో నటించడం ఎంతో తృప్తిని కలిగిస్తోంద’’ని అన్నారు. కేరళకు చెందిన ప్రముఖ నటీమణులు విందూజ- అశ్వతి ఈ సీరియల్‌లో ఇద్దరు కథానాయికలుగా నటించడం విశేషం. ఇంకా ఈ సీరియల్‌లో నవీన యాట, శ్రీలత, ఏకనాథ్‌, సంజయ్‌కుమార్‌, మాధవీలత, ఉదయభగవతుల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని