రామ్‌.. ‘ది వారియర్‌’

రామ్‌ కథానాయకుడిగా దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా

Published : 18 Jan 2022 00:33 IST

రామ్‌ కథానాయకుడిగా దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ ద్విభాషా చిత్రానికి ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో రామ్‌ శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌గా ఆకట్టుకునేలా కనిపించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘రామ్‌ నటిస్తున్న 19వ చిత్రమిది. ఆయన తొలిసారి పోలీస్‌ పాత్రను పోషిస్తున్నారు. చక్కటి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘రన్‌’, ‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాలను మించిన స్థాయిలో లింగుస్వామి ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని