‘లూజర్‌ 2’.. అందరికీ కనెక్ట్‌ అవుతుంది

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లూజర్‌ 1’. ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సిరీస్‌కు కొనసాగింపుగా ‘లూజర్‌ 2’ ప్రేక్షకుల

Published : 18 Jan 2022 00:33 IST

నాగార్జున

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లూజర్‌ 1’. ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సిరీస్‌కు కొనసాగింపుగా ‘లూజర్‌ 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రవణ్‌ మాదాల, అభిలాష్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఈనెల 21న ‘జీ5’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దీనికి హీరో నాగార్జున, అక్కినేని అమల, బ్యాడ్మింటన్‌ ఆటగాడు చేతన్‌ ఆనంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘లూజర్‌’ సిరీస్‌ను ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించేలా అద్భుతంగా తీశారు. ‘లూజర్‌ 2’ ట్రైలర్‌ కూడా చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. దీన్ని ప్రేక్షకులంతా ఆదరించి టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సిరీస్‌ కోసం మేమందరం చాలా కష్టపడ్డాము. ఇలాంటి మంచి కంటెంట్‌ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశమిచ్చినందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌కు, సుప్రియకు ధన్యవాదాలు’’ అన్నారు నటుడు ప్రియదర్శి. ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, అభిలాష్‌, శశాంక్‌, రవి వర్మ, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు