కొత్త చిత్రం ఖరారు

‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణ్‌కృష్ణ. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతి

Published : 18 Jan 2022 00:33 IST

‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణ్‌కృష్ణ. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతి సందర్భంగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడాయన తదుపరి చిత్రం స్టూడియో గ్రీన్‌ సంస్థలో ఖరారైంది. ఈ విషయాన్ని నిర్మాత కె.ఇ జ్ఞానవేల్‌ రాజా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సంక్రాంతికి ‘బంగార్రాజు’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు కల్యాణ్‌కృష్ణ. ఇప్పుడాయనతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తామ’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని