‘ధగడ్‌ సాంబ’ వినోదాలు

సంపూర్ణేష్‌ బాబు హీరోగా ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధగడ్‌ సాంబ’. ఆర్‌.ఆర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే

Published : 18 Jan 2022 00:33 IST

సంపూర్ణేష్‌ బాబు హీరోగా ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధగడ్‌ సాంబ’. ఆర్‌.ఆర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ ‘‘దర్శకుడు మంచి కథ ఎంపిక చేసుకున్నారు. నిర్మాత రాజు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాననే చిన్న బాధ నాలో ఉండేది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం మాత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉన్న చిత్రమిది. మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సంపూ ఫైట్స్‌, డ్యాన్సులు బాగా చేశారు. ఈ చిత్రంలో ఆయన్ని సరికొత్తగా చూస్తారు. నాకింత మంచి సినిమా చేసే అవకాశమిచ్చినందుకు నిర్మాత రాజుకు థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్‌ వేయడం జరిగింది. ఆ పాటలకు సంపూ తనదైన శైలిలో వేసిన స్టెప్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి సోనాక్షి నటన అదనపు ఆకర్షణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని