Akshay Kumar: రంగుల పండక్కి బచ్చన్ పాండే
కరోనా మూడో వేవ్ కొనసాగుతున్న వేళ బాలీవుడ్లో ఈ నెల్లో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. వచ్చే నెల్లో రానున్న చిత్రాల రాక దాదాపు అనుమానమే. మార్చి నుంచి పరిస్థితులు కొంత మెరుగయ్యే అవకాశం..
కరోనా మూడో వేవ్ కొనసాగుతున్న వేళ బాలీవుడ్లో ఈ నెల్లో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. వచ్చే నెల్లో రానున్న చిత్రాల రాక దాదాపు అనుమానమే. మార్చి నుంచి పరిస్థితులు కొంత మెరుగయ్యే అవకాశం ఉండటంతో మార్చి ద్వితీయార్ధం నుంచి విడుదల చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్‌కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే మార్చి 4న రావాలి. మార్చి 18న హోలీ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొత్త పోస్టర్‌తో ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్ కామెడీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫర్హాద్ శామ్‌జీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ నాయికగా నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM