Varma: సైకో ప్రేమలో పడితే?

‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రం ‘వర్మ’. ఇందులో చక్కటి ప్రేమకథ  ఉంది’’ అన్నారు నట్టి క్రాంతి. ఆయన హీరోగా నట్టి కుమార్‌ తెరకెక్కించిన చిత్రమే ‘వర్మ’. వీడు తేడా.. అన్నది ఉపశీర్షిక. ముస్కాన్‌, సుపూర్ణ మలాకర్‌ కథానాయికలు. నట్టి కరుణ నిర్మాత.

Updated : 19 Jan 2022 06:50 IST

‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రం ‘వర్మ’. ఇందులో చక్కటి ప్రేమకథ  ఉంది’’ అన్నారు నట్టి క్రాంతి. ఆయన హీరోగా నట్టి కుమార్‌ తెరకెక్కించిన చిత్రమే ‘వర్మ’. వీడు తేడా.. అన్నది ఉపశీర్షిక. ముస్కాన్‌, సుపూర్ణ మలాకర్‌ కథానాయికలు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా జనవరి 21న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నట్టి క్రాంతి.

* ‘‘టైటిల్‌ చూసి అందరూ ఇది రామ్‌గోపాల్‌ వర్మకు సంబంధించిన చిత్రమనుకుంటున్నారు. ఆయన కథకు దీనికి సంబంధం లేదు. ప్రచారం కోసమే ఆ పేరు పెట్టాం. థ్రిల్లింగ్‌ అంశాలతో నిండిన మంచి ప్రేమకథా చిత్రమిది. కథ ప్రకారం నేనిందులో వర్మ అనే సైకో పాత్రలో కనిపిస్తా. ఇలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? చివరికి ఏమైంది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హీరోగా నా తొలి సినిమాకు మా నాన్నే దర్శకుడు కావడం అదృష్టంగా భావిస్తున్నా. చమ్మక్‌ చంద్ర, శ్రీధర్‌ల వినోదం నవ్వులు పూయిస్తుంది. ఇందులోని ఓ పాటను కశ్మీర్‌లో గడ్డ గట్టించే చలిలో నాలుగు రోజుల పాటు చిత్రీకరించాం. నటుడిగా నాకు రజనీకాంత్‌ స్ఫూర్తి. నటనపై ఆసక్తితో యూఎస్‌లోని న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నా. తర్వాత సత్యానంద్‌ వద్ద కొన్నాళ్లు నటనలో తర్ఫీదు పొందా. నాకు నటుడిగా, నిర్మాతగా ఎదగాలని ఉంది. నేను నిర్మించిన ‘డి.జె’ ఈనెల 28న విడుదలవుతుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని