
Updated : 19 Jan 2022 07:04 IST
Jai Bheem: ‘జై భీమ్’కు ఆస్కార్ గౌరవం
సూర్య కథానాయకుడిగా నటించిన ‘జై భీమ్’ చిత్రం ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్ అకాడెమీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఉంచారు. ‘సీన్ ఎట్ ది అకాడెమీ’ విభాగంలో ఈ వీడియో ఉంది. అకాడెమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాదు విమర్శకులనూ మెప్పించింది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు.
Tags :